గాంధీగిరి vs దాదాగిరి ఫిబ్రవరి 9, 2007
Posted by కిష్టయ్య in అవీ ఇవీ.trackback
శంకర్ దాదా గారు మళ్ళీ తెర మీదకి వస్తున్నారు. Lage raho Munnabhai మొన్ననే చూసాను. చిరంజీవిగారే ఈ సినిమాకి తెలుగు versi0n లో హీరో అని తెలిసి నప్పటినుంచి నాలోబోల్డు సందేహాలు.
1. Munnabhai మొదటి దానిలో ఒక్క డుష్యుమ్ డుష్యుమ్ కూడా చెయ్యలేదు. ప్రేక్షకులకి రెండవ దానిలో కొంచం మెత్తగా కనపడినా అంత తేడా కనపడలేదు. కానీ మన శంకర్ దాదా అలా కాదు కదా. ముందో ఫైటు, వెనకో ఫైటు చేసేసాడు.
2. Lage raho లో చాలా మటుకు గాంధీగారిని elevate చేసి మున్నాభాయిని సైడు character చేసారు. మరి మన చిరంజీవిగారి సినిమాలో చిరంజీవిగారినే సైడు చేసేస్తే ఎలా.
3. మున్నాభాయి తిన్నట్టు శంకర్ దాదా చెంప దెబ్బ తింటాడా?
4. Lage raho లో గాంధీగారు కనపడితేనే మున్నాభాయి ధైర్యంగా, ధీమాగా కనపడ్డాడు. మరి మన శంకర్ దాదా గారు గాంధీ గారికి తన పక్కన అంత ప్రాధాన్యతని ఇవ్వగలడా.
ఇంకా ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి. చూద్దాం, మన పరుచూరివారు ఎమి చేస్తారో. పరుచూరివారు అని ఎందుకు అన్నాను అంటే, ఈ సినిమాకి కధే ప్రాధాన్యం.
క్రిష్ణయ్య ..సందేహం వద్దయ్య …….చిరంజీవికి ఇట్టాంటి కథలు దొరకాలేగానీ ఇరగదీయడూ….
(ప్రాసకోసం “గారు” ని మింగేశా, ఏమనుకోకండే!!!)
మరే…. అసలే…చిరంజీవి మంచి కసి మీదున్నాడు… మాకు ఏ సందేహాలు లేవు… సినిమా ఎప్పుడొస్టుందో…కదా!!!
నవీన్ మరియు రాజు
నా సందేహం చిరంజీవి గారి గురించి కాదండి. ఆయన మంచి నటులే. నా సందేహమంతా ఆయనకి ఈ character సరిపోతుందా అని. MBBS లోని character సరిపోయింది. కానీ జిందాబాద్ సరిపోదేమో అని.
ఆయన అభిమానులైన మీకు gaurantee గా ఈ సినిమా నచ్చుతుంది లెండి.
హీరో ని ఎలివేట్ చెసే పనిలో మన వాళ్ళు కధని కుళ్ళబొడిచేస్తారు.అందుకే మన సినిమాలు అలా ఏడుస్తాయి.ఖచ్చితం గా ఈ సినిమా మాత్రం హింది సినిమా అంత కధావిలువలతో వుండదు.
మన తెలుగు సినిమాలు (పెద్ద) హీరోల చుట్టూ తిరుగుతాయి. వాటికోసం పంచ శీల సూత్రాలు.
1. హీరోయిన్ హీరోను కొట్ట కూడదు. హీరోయిను “రేయ్” అనకూడదు.
2. కామెడీ సీన్లో కూడా హీరో నే డామినేట్ చెయ్యాలి.
3. తండ్రి పాత్ర వేసేవాడు అనామకుడు అయ్యుండకూడదు.
4. తల్లి కూడా ఎప్పుడు పడితే అప్పుడు “రేయ్” అనకూడదు.
5. ఫ్రెండెప్పుడూ “గురూ” అనో “అన్నా” అనో వ్యక్తి పూజ చెయ్యాలి.
కొద్దో గొప్పో నాగార్జునా, వెంకటేష్ మేలు వాళ్ళ సినిమాలలో అంత “హీరోజేషన్” వుండదు.
మరి చిరంజీవి సినిమాలంటారా? గుర్తుందా మీకు “ఏంది భే ఎట్టా వుంది ఒళ్ళు” పాటకు నగ్మా ఎదుర్కొన్న అనుభవాలు.
విహారి.
http://vihaari.blogspot.com
లేదు లెండి…, ప్రభు దేవా కధా… కధ కి అన్యాయం చేయడు లెండి…
రాధిక గారి అభిప్రాయంతో ఏకీభవించకుండా ఉండలేకున్నాను. చిరు కోసం తప్పకుండా కథని కథనాన్ని కొంతలో కొంతయినా మారుస్తారు. మార్చటం అవసరమని కూడా నేను అనుకుంటున్నా. నాక్కూడా శంకర్ దాదా కంటే మున్నాభాయ్ బాగా నచ్చింది. చిరు అభిమానిని కాబట్టి శంకర్ దాదా రిలీజ్ అయ్యేంత వరకూ ఎన్ని అవకాశాలు వచ్చినా మున్నాభాయ్ చూడలేదు. శంకర్ దాదా రెండు సార్లు చూశాకే అది చూశా. మెగాస్టార్ కామెడీ టైమింగ్ మాత్రం సంజయ్ దత్ కంటె ఎన్నో రెట్లు మెరుగని నా అభిప్రాయం.
విహారి గారు చెప్పిన అయిదో అంశం…నేనూ అంగీకరిస్తున్నాను…
ఇంక… హర్ష…గారు చెప్పిన విషయంతో..ఏకీభవించ లేకపోతున్నాను..
కధ మార్చకూడదని నా అభిప్రాయము..
“మెగాస్టార్ కామెడీ టైమింగ్ మాత్రం సంజయ్ దత్ కంటె ఎన్నో రెట్లు మెరుగని నా అభిప్రాయం.”
ఇది మాత్రం అక్షర సత్యం.
శంకర్ దాదా MBBS చూసిన తరువాత చిరంజీవి ఇది తప్పకుండా చెయ్యగలుగుతాడనే నమ్మకం ఉంది. కాకపోతే ఈ concept మానవాళ్ళకు ఎంత వరకూ ఎక్కుతుందో చూడాలి
కధ ఇప్పుడే కద మొదలు అయ్యింది. చూద్దాం సినిమా రిలీజ్ అయ్యేలోపు కధలో కధనంలో ఎన్ని మార్పులు వస్తాయొ. పై comments నుంచి నేను గ్రహించింది ఏమిటి అంటే, మన అందరికీ, చిరంజీవి గారి సినిమా అంటే బాగుంటుంది అని బోలెడు నమ్మకం ఉంది. మంచిదే, చూద్దాం ఏమి జరుగుతుందో.