jump to navigation

తొలి పలుకు అక్టోబర్ 17, 2006

Posted by కిష్టయ్య in అవీ ఇవీ.
trackback

ప్రతీ రోజూ చేసేవే – ఐదున్నర కల్ల నిద్ర లేవడం, స్నానాధికాలు ముగించి కొట్టు తెరవడం. పాల బండి వాడు వచ్చి ప్యాకెట్లు పడేసి వెళ్ళి పోయాడు. మొత్తం 65. స్కూలు మాస్టారుగారి అబ్బాయి అమెరికా నుండి వస్తున్నాడుట. అతను ఉన్న పది రోజులు మామూలు కన్నా 3 ప్యాకెట్లు ఎక్కువ కావాలి అని నిన్ననే చెప్పారు. సరిపోతాయిలే అనుకున్నా.

పేపర్ వాడు ఇంకా రాలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్తాతో పాటు ఈ పది రోజులు Deccan Chronicle, Hindu కూడా తెప్పించమని మాస్టారుగారు చెప్పారు.

మాస్టారుగారి పిచ్చికాని, NRIలు internet ఉండగా, చేతిలో పట్టుకుని పేపర్ ఎందుకు చదువుతారు. అతను చదవక పోతే నష్టం నాకే కద. చూద్దాం రెండు రోజులు. అప్పుడే మానేద్దాం తెప్పించడం. అయినా, ఈ మధ్య వార్తలు తక్కువ, వాణిజ్య ప్రకటనలు ఎక్కువ అయ్యాయి. Internet అంటే ఒక ఆలోచన వచ్చింది. మనకి internet ఉంది కదా, ఒక printer కొని, internet లో మనకి అవసరమైన్ వార్తలనే సేకరించి, print తీసి, newspaper కింద అమ్మితే….. అమ్మో ఖర్చు మనకే పడుతుంది. అందులోను వాణిజ్య ప్రకటనలు లేనిదే newspaper అవుతుందా అని అడిగే వాళ్ళూ ఉన్నారు. మొన్నెప్పుడో ఈనాడులో “నిజాల గోడ పత్రిక” చదివా. Essential News అనేది సరైన పేరు. ఎర్రయ్యగారి లాగే నేను ఒక ఉపాయం చెయ్యాలి.

ఆలోచిస్తుండగానే వచ్చాడు పేపర్ అబ్బాయి. ఇంక పనులు మొదలు పెట్టాలి.

ప్రకటనలు

వ్యాఖ్యలు»

1. వీవెన్ - అక్టోబర్ 17, 2006

బాగుంది!

2. కిరణ్ కుమార్ చావా - అక్టోబర్ 17, 2006

ఎవరు మీరు?

3. కిష్టయ్య - అక్టోబర్ 17, 2006

కిరణ్ గారి comment కి –
టూకీగా లో రాసాను నేను ఎవరినో.

4. కిరణ్ కుమార్ చావా - అక్టోబర్ 18, 2006

ధన్యవాదములు,

నేను అది ఈ సరికే చదివినాను

కాకపోతే మీరు నిజంగా కిళ్ళీ కొట్టులో ఉంటున్నరా?

లేక పోతే మాల్గుడి కథలులా కిళ్ళీ కొట్టు బ్లాగులు వ్రాస్తున్నరా?

అని ఓ చిన్న అనుమానం

మీకు కంప్యూటరు గురించి ఎలా తెలుసు?

మరోలా అనుకోకుంటే తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నది

తెలుగు బ్లాగులు కేవలము గీకులకే పరిమితమైనాయని ఓ అపవాదు ఉన్నదండీ మీ బ్లాగు కాదని నిరూపిస్తుందేమో అన్న ఓ చిన్న ఆశ

5. కిష్టయ్య - అక్టోబర్ 18, 2006

మీ సందేహం నేను గీకునా అని అయితే, నా సమాధానం “కానే కాదు”. కిళ్ళీ కొట్టు ఈ బ్లాగుకి మూలం అనుకోండి. ఇంకొక ఐదు ఏళ్ళలో కంప్యూటరు గురించి తెలియని వారు ఉండరు అని నా నమ్మకం. ATM లు, సెల్ ఫోన్లు లాంటి పరికరాల వాడుక పెరిగేకొద్ది technology అందరికి దగ్గిర అవుతుంది.
ఈ technology ని మన లాంటి బ్లాగర్లు అందరికి చేరవేయచ్చు అని చెప్పడానికే ఈ బ్లాగ్ అని నేను అనుకుంటున్నాను.

అసలు విషయం దాటేసాను అని అనుకుంటున్నారా? నిజమే 🙂


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: