jump to navigation

టూకీగా

కిళ్ళీ కొట్టులొ కూర్చునే వాడికి బ్లాగులు ఎందుకు అని అనుకోవచ్చు…. నేను ప్రతీరోజు వినే/చూసే సంగతులు, కలిసే/కనపడే మనుషుల విశేషాలు, చదివే వార్తలు, వీటన్నిటిని బుర్రలో ఉంచేసుకుంటె, బుర్ర వేడెక్కి కళ్ళు  బైర్లు కమ్ముతున్నాయి. ఇలా బ్లాగు ద్వారా బయట పెట్టచ్చు కదా అని మొదలు పెట్టా. మొదలు పెట్టడానికి చాలా అలోచించాల్సి వచ్చింది. ఒక పక్కన కిళ్ళీ కొట్టు, ఇంకొ పక్కన, ఇల్లు, వాకిలి, పెళ్ళాం, పిల్లలు. వీటన్నిటితో బ్లాగ్ చెయ్యడం కుదురుతుందో లేదో అని అలోచించా. చూద్దాం ఎంత దూరమ్ వెల్తుందో.

ఇక పొతే…. “ఈ బ్లాగ్ లొ ఏమి చూడొచ్చు” అని అడుగుతారేమొ, అక్కడికే వస్తున్నా…

- నా కిళ్ళీ కొట్టుకి బోల్డు మంది వస్తుంటారు. వాల్ల వేషాలు, విశేషాల గురించి బ్లాగ్ చేస్తాను.

- వార్తా పత్రికలు అమ్ముతాను కాబట్టి, కొంత మంది వాటిని అక్కడే కూర్చుని చదివేస్తారు. చదివి విశ్లేషిస్తారు కూడా. మరి అవి అన్నీ కూడా విశేషాలే కదా. వాటి గురించి బ్లాగ్ చేస్తాను.

- దేని గురించైన మాట్లాడగలను అని నా చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు. ఏ విషయమైన ఇంకొకరికి ఉపయొగపడుతుంది అనిపిస్తె, దాని గురించి బ్లాగ్ చేస్తాను.

- నాకు జిగ్నాస ఎక్కువ. దేని గురించి తెలుసు కోవాలి అన్న, నేర్చు కోవాలి అన్న, నేను ముందు ఉంటాను. అలా నాకు తెలిసిన వాటి గురించి, తెలుసుకున్న వాటి గురించి బ్లాగ్ చేస్తాను.

- ఇంక సినిమాల విషయానికి వస్తే, తక్కువే చూస్తాను. హీరోల కొసము, హీరోయిన్ల కొసము నేను సినిమాలు చూడను.  సినిమాల గురించి అభిప్రాయాలు ఎక్కువే. వాటి గురించి బ్లాగ్ చేస్తాను.

- రాజకీయాలంటే అంత మోజు లేదు కాని అభిప్రాయాలు ఎక్కువే. వాటి గురించి బ్లాగ్ చేస్తాను.

మరి చెప్పడానికి ఇన్ని విశేషాలు ఉండగా, బ్లాగ్ చెయ్యకుండా ఉండలేను కదా.

వ్యాఖ్యలు»

1. రవి వైజాసత్య - అక్టోబర్ 19, 2006

మీ గురించి చెప్పకపోవడం మంచిదే..అప్పుడు కళ్లజోడు తగిలించుకోకుండా చదువుతారు. ఏదేమైనా మీ బ్లాగు అదిరింది. కాక పోతే ఇలాగే కొనసాగించాలని అభ్యర్ధన

2. శోధన - నవంబరు 24, 2006

మీరు హైదరాబాదులో ఉంటే గనక ఒక్క సారి తెలుగు బ్లాగర్ల సమావేశానికి రావాలని అభ్యర్ధన :-)

3. నవీన్ - మే 3, 2007

కిష్తయ్య గారు,
మీ బ్లొగ్ అదిరింది సార్!
మీరు regularగ రాయలని ప్రార్ధన.

4. nenusaitham - మే 4, 2007

కిట్టయ్య గారు,

మీ బ్లాగులు జర్దా కిళ్ళీ లాగా అదరాలి.

-నేనుసైతం