2006 పోయి 2007 వచ్చే ఢాం ఢాం ఢాం జనవరి 9, 2007
Posted by కిష్టయ్య in నా విశేషాలు.1 comment so far
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒక వారం ఆలస్యంగా అయినా చెప్పాను అని అదో తృప్తి. 2006 పోయి 2007 వచ్చే ఢాం ఢాం ఢాం అని సంబరమే తప్పించి వేరె చెప్పుకో తగ్గ మార్పులు ఏమీ లేవు. కానీ ఎప్పటి లాగే ఈ సంవత్సరం కూడా ప్రతిజ్ఞలు (resolutions) చేసేసాను/తీసుకున్నాను. ఎన్నింటికి న్యాయం చేస్తానో ఆ వెంకన్న బాబుకి, మా ఆవిడకి తెలియాలి, తెలుస్తాయి కూడా.
అందులో ఒకటి, చిన్ననాటి స్నేహితులందరి emails తెలుసుకుని, వారిని పలకరించాలి. ఇది నాకు అత్యంత ముఖ్యమైనది. ఈ ప్రతిజ్ఞల పట్టీలో ప్రతీ ఏడూ ఉండేది, వారానికి ఒక్కసారైనా వ్యాయామం చెయ్యడం. కొట్టులో కూర్చుని పని చేసేవాడిని నాకెందుకే వ్యాయామం అంటే వినదు మా ఆవిడ. ఉత్తినే కూర్చుంటున్నారు కాబట్టే వ్యాయామం అని ఆవిడ వాదన.
చూద్దాం ఏవి ఎంత వరకూ పాటిస్తానొ.
