jump to navigation

నవ్వు నవ్వించు నవంబరు 23, 2006

Posted by కిష్టయ్య in నా విశేషాలు.
trackback

నాకు నవ్వడం వచ్చు కానీ నవ్వించడం అంతగా రాదు. ఎక్కడైనా విన్న హాస్యోక్తిని కూడా సరిగ్గా చెప్పి నవ్వించడం రాదు అని నాకు నా చిన్న తనంలోనే తెలిసిపోయింది. పదిహేను సంవత్సరాలు అయినా నాకు ఇంకా గుర్తు ఉంది. ఆ రోజు స్కూలుకి శెలవలు అయ్యాక మొదటి రోజు. మాష్టారుగారు పాఠాలు ఇంకా మొదలు పెట్టలేదు. ఏమి చెప్పాలో తెలియక, ఒకొక్కరిని ముందుకు వచ్చి ఒక జోక్ చెప్పమన్నారు. ఒకొక్కొరు వస్తున్నరు. వారి జోకులకి ఒకసారి నవ్వుతున్నాము, మరొకసారి నవ్వలేక ఏడుస్తున్నాము. నేను ధైర్యం చేసి ముందుకు వచ్చి ఒక joke చెప్పాను. చెప్పాక తెలిసింది ఏమిటీ అంటే, joke ని ఎక్కాలు అప్పచెప్పినట్టుగా గబగబ చెప్పేసాను. ఎవ్వరికి నవ్వు రాలేదు. పోనీ అక్కడితో ఆపెయ్యలేదు, అర్ధం అవ్వలేదేమో అని వివరించడం మొదలు పెట్టాను. అప్పుడు వెనక బెంచీ వాళ్ళందరు పగలబడి నవ్వడం మొదలు పెట్టారు. నేను ఏడుపు మొహం పెట్టుకుని వెనక్కి వచ్చేసాను.

అప్పటి నుంచి ఏ joke విన్నా గమనించడం మొదలు పెట్టాను. Timing చాలా ముఖ్యమని తెలిసింది. అలాగే సంధర్భం కూడా. అలాగే సినిమాలో వచ్చే హాస్య సన్నివేసాలని jokes లా చెప్పడంలో మజా లేదని కాలేజీలో తెలుసుకున్నాను. 

ప్రస్తుతానికి నవ్వించడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను.

వ్యాఖ్యలు»

1. radhika - నవంబరు 24, 2006

mii prayatnam phalimcimdi.emdukamtea mee post chusi nenu navvanu.
he he heeeeeeeeeeee

2. శోధన - నవంబరు 24, 2006

LOL

3. రఘు రామ్ శేఖర్ వెలగలేటి - నవంబరు 24, 2006

కాస్త గుర్తు ఉంటే ఆ జోక్ ఏదో ఇప్పుడు చెప్పండి….. నవ్వడానికి ట్రై చేస్తాం…..

ఇప్పుడు మాత్రం నవ్వాను…..

4. kaloji - నవంబరు 25, 2006

నవ్వు నవ్వించు title నివు రాసినదానికి ఎమైన సమ్మదం వుందా, ఈలా title పెట్టడం ఎమైన joke, దినికి మేము నవ్వలా ??

5. కిష్టయ్య - నవంబరు 26, 2006

కాళోజీ గారికి
మిమ్మల్ని /మరెవ్వరినో నవ్వించడానికి ఈ post రాయలేదు. ఈ blog కి వచ్చి తీరికగా post ని చదివినందుకు ధన్యవాదములు.

6. kaloji - నవంబరు 27, 2006

కిష్టయ్య మీ జవాబు నా blog లొ ఈవాలి, లేకపొతె నకు ఎట్ల తెలుస్తుది మి జవాబు. any way మి జవాబుకు దన్యవాదాలు

7. రానారె - నవంబరు 28, 2006

నేనూ అంతే ఒకోసారి ఫెయిలైపోతుంటా. ఐతే మనం ఏదైనా జోక్ చేప్పి నవ్వించాలనుకొనేటప్పుడు అది వినే మన మిత్రులు ఏ మూడ్‌లో వున్నారనేది తెలుసుకోవాలి. వాళ్లు సరదామూడ్‌లో వుంటే సాదాసీదా జోకు కూడా పెద్దదైపోతుంది. ఇదీ టైమింగే. మీరన్న టైమింగ్ చాలా ముఖ్యం. తెలుగు సినిమాల్లో మన హాస్యనటులు (కొత్తవారుకూడా) అందరూ ఈ విషయంలో గొప్ప ప్రతిభావంతులని నా అభిప్రాయం.