నవ్వు నవ్వించు నవంబరు 23, 2006
Posted by కిష్టయ్య in నా విశేషాలు.7 comments
నాకు నవ్వడం వచ్చు కానీ నవ్వించడం అంతగా రాదు. ఎక్కడైనా విన్న హాస్యోక్తిని కూడా సరిగ్గా చెప్పి నవ్వించడం రాదు అని నాకు నా చిన్న తనంలోనే తెలిసిపోయింది. పదిహేను సంవత్సరాలు అయినా నాకు ఇంకా గుర్తు ఉంది. ఆ రోజు స్కూలుకి శెలవలు అయ్యాక మొదటి రోజు. మాష్టారుగారు పాఠాలు ఇంకా మొదలు పెట్టలేదు. ఏమి చెప్పాలో తెలియక, ఒకొక్కరిని ముందుకు వచ్చి ఒక జోక్ చెప్పమన్నారు. ఒకొక్కొరు వస్తున్నరు. వారి జోకులకి ఒకసారి నవ్వుతున్నాము, మరొకసారి నవ్వలేక ఏడుస్తున్నాము. నేను ధైర్యం చేసి ముందుకు వచ్చి ఒక joke చెప్పాను. చెప్పాక తెలిసింది ఏమిటీ అంటే, joke ని ఎక్కాలు అప్పచెప్పినట్టుగా గబగబ చెప్పేసాను. ఎవ్వరికి నవ్వు రాలేదు. పోనీ అక్కడితో ఆపెయ్యలేదు, అర్ధం అవ్వలేదేమో అని వివరించడం మొదలు పెట్టాను. అప్పుడు వెనక బెంచీ వాళ్ళందరు పగలబడి నవ్వడం మొదలు పెట్టారు. నేను ఏడుపు మొహం పెట్టుకుని వెనక్కి వచ్చేసాను.
అప్పటి నుంచి ఏ joke విన్నా గమనించడం మొదలు పెట్టాను. Timing చాలా ముఖ్యమని తెలిసింది. అలాగే సంధర్భం కూడా. అలాగే సినిమాలో వచ్చే హాస్య సన్నివేసాలని jokes లా చెప్పడంలో మజా లేదని కాలేజీలో తెలుసుకున్నాను.
ప్రస్తుతానికి నవ్వించడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను.
